స్వల్ప అస్వస్థతకు గురైన రాహుల్‌ గాంధీ

Apr 21,2024 14:53 #congress leader, #Rahul Gandhi, #Ranchi

రాంచీ :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అస్వస్థతకు గురైనట్లు ఆపార్టీ ప్రతినిధి జైరాం రమేష్‌ ఆదివారం పేర్కొన్నారు. రాహుల్‌ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో నేడు రాంచీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనలేరని   అన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే హాజరవుతారని జైరాం రమేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  నేడు  రాంచీలో  నిర్వహించే ఇండియా కూటమి ర్యాలీలో భగవంత్‌ మాన్‌, లాలూ యాదవ్‌ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు.

రాహుల్‌ గాంధీ నేడు మధ్యప్రదేశ్‌లోని సాత్నా, జార్ఖండ్‌లోని రాంచీలలోని భారీ బహిరంగ సభలో ప్రసంగించాల్సి వుంది.

➡️