Loksabha: ‘తొలి’ నోటిఫికేషన్‌ విడుదల

ఢిల్లీ : 2024 తొలి దశ లోక్‌సభ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ దశలో 102 లోక్‌సభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల నుంచి 102 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 28తేదీన నామినేషన్లను  పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 తేదీ. 9 లోక్‌సభ స్థానాలున్న ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు రాష్ట్రాలు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, లక్షద్వీప్‌లోని ఒక లోక్‌సభ స్థానం మొదటి దశకు సిద్ధంగా ఉన్నాయి. తొలి దశలో ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

 

తొలి దశలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు

అరుణాచల్ ప్రదేశ్ -2,

బీహార్ – 4,

అస్సాం – 4,

ఛత్తీస్ గఢ్ – 1,

మధ్యప్రదేశ్ – 6,

మహారాష్ట్ర-5,

మణిపూర్ – 2,

మేఘాలయ – 2,

మిజోరాం – 1,

నాగాలాండ్ – 1,

రాజస్థాన్ నుంచి – 12

సిక్కిం – 1

తమిళనాడు – 39,

త్రిపుర – 1,

ఉత్తరప్రదేశ్‌-8,

ఉత్తరాఖండ్‌- 5,

పశ్చిమ బెంగాల్‌- 3,

అండమాన్ అండ్ నికోబార్‌-1,

జమ్మూ కాశ్మీర్‌- 1,

లక్షద్వీప్‌- 1 , పుదుచ్చేరి- 1

లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

➡️