సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష తేదీ మార్పు…

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఇచ్చిన పరీక్ష తేదీని ఎన్డీఏ మార్చింది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ దరఖాస్తులకు గడువు శనివారంతో ముగియనుండగా … ఆ గడువును పొడిగించింది. గతంలో డిసెంబర్‌ 16 వరకు దరఖాస్తులకు గడువు ఉండగా.. దాన్ని డిసెంబర్‌ 20 వరకు ఎన్టీఏ పెంచింది. అలాగే, ఈ పరీక్ష తేదీని జనవరి 21 నుంచి జనవరి 28(ఆదివారం)కి మార్పు చేసింది. పరీక్ష ఫీజును డిసెంబర్‌ 20 వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చని తెలిపారు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే డిసెంబర్‌ 22 నుంచి 24వ తేదీ వరకు సవరించుకొనేందుకు అవకాశం కల్పించారు. పూర్తి సమాచారం కోసం https://exams.nta.ac.in/AISSEE/ లో తెలుసుకోవచ్చు.

➡️