చేతులెత్తేసిన మోడీ ప్రభుత్వం

stagnant-job-rate-worse-for-the-educated-iim-study
  •  ఉద్యోగ కల్పనలో స్తబ్దత 
  •  తైవాన్‌, ఇజ్రాయిల్‌తో ఒప్పందాలు 
  • కార్మికులను తరలించేందుకు ప్రయత్నాలు 
  • లక్నో ఐఐఎం వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో ఉద్యోగాల వృద్ధి రేటులో స్తబ్దత నెలకొన్నదని లక్నో ఐఐఎం పరిశోధకులు తెలిపారు. బిట్స్‌ పిలానీ, కేంద్ర వ్యవసాయ-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో లక్నో ఐఐఎం పరిశోధకులు ఓ నివేదికను రూపొందించారు. జాతీయ శాంపిల్‌ సర్వే కార్యాలయం, ఉద్యోగ-నిరుద్యోగ సర్వే, పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేల నుండి తీసుకున్న సమాచారం ఆధారంగా నివేదికను తయారు చేశారు. 1987-88 నుండి 2004-05 వరకూ ఉద్యోగాల కల్పనలో వృద్ధి కన్పించిందని, అయితే 2004-05 నుండి 2018-19 వరకూ తిరోగమనం నమోదైందని నివేదిక తెలియజేసింది. ఆ తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పేమీ రాలేదని చెప్పింది. దీనిని బట్టి చూస్తే ఉద్యోగ కల్పనలో మోడీ ప్రభుత్వం చేతులెత్తేసిందని అర్థమవుతోంది.

నివేదిక ప్రకారం 2020-21లో దేశంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 556.1 మిలియన్లు. వీరిలో అత్యధికంగా 54.9% మంది స్వయం ఉపాధి పొందిన వారే. కేవలం 22.8% మంది మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులు. 22.3% మంది క్యాజువల్‌ ఉద్యోగులు. ఉద్యోగ సంక్షోభం, ఉద్యోగ నాణ్యతపై ‘ది వైర్‌’ పోర్టల్‌ గత సంవత్సరం మే 2న ఓ కథనాన్ని అందించింది. దేశంలో ఉద్యోగ నాణ్యత చాలా తక్కువగా ఉన్నదని, అనేక ఉద్యోగాలలో తక్కువ వేతనాలు ఇస్తున్నారని సీఎంఐఈకి చెందిన మహేష్‌ వ్యాస్‌ చెప్పారు. విదేశాలకు కార్మికులుగ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా ఉద్యోగినుల విషయంలో వివక్ష కొనసాగుతోందని ఐఐఎం నివేదిక ఎత్తిచూపింది. 1983 నుండి 2020-21 వరకూ పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగుల శాతం (ఎల్‌ఎఫ్‌పిఆర్‌) తగ్గింది. దేశంలో నైపుణ్యం లేని లేదా కొంతమేర నైపుణ్యం కలిగిన వారిని తైవాన్‌, ఇజ్రాయిల్‌ దేశాలకు పంపి అక్కడ వారికి ఉపాధి కల్పించడానికి మోడీ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహిస్తోంది. దేశంలో ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమల్లో వారికి ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోవడమే దీనికి కారణం. ఈ నెల 16న తైవాన్‌తో మోడీ సర్కారు ఎంఓయూ కుదుర్చుకుంది. దేశంలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం కారణంగానే కార్మికులను ఇజ్రాయిల్‌ పంపుతున్నారని బీబీసీ గత నెలలో తెలిపింది. గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధం చేయడానికి ముందే 42 వేల మంది నిర్మాణ కార్మికులు, నర్సులను పంపేందుకు మోడీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

నివేదిక ఏం చెప్పింది ?

విద్యా స్థాయి పెరిగినప్పటికీ దానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడడం లేదు. దేశంలో ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ప్రజా పనులపై మరింతగా దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించింది. ఉపాధి హమీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు 5% మేర పెరుగుతాయని, మహిళా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతుందని, గ్రామీణ వేతన స్థాయిలు పెరుగుతాయని తెలిపింది.

➡️