Suresh Gopi : ఇందిరా గాంధీ భారతమాత : సురేష్‌ గోపి

Jun 15,2024 16:55 #BJP MP, #kerala, #Suresh Gopi

తిరువనంతపురం : కేరళకు చెందిన బిజెపి ఎంపి సురేష్‌ గోపి మాజీ ప్రధాని ఇందిరిగాంధీని భారతమాతగా అభివర్ణించారు. అలాగే కె. కరుణాకరన్‌, మార్క్సిస్టు సీనియర్‌ నాయకులు ఇ.కె నాయనార్‌లు తన రాజకీయ గురవువులు అని చెప్పారు. బుధవారం సురేష్‌ గోపి పుంకున్నంలో ఉన్న కరుణాకరన్‌ స్మారక స్థూపం ‘మురళీ మందిరం’ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కరుణాకరన్‌ స్మారక సందర్శనకు ఎలాంటి రాజకీయాల్ని జోడించవద్దు. ఆయన నాకు గురువు. ఆయనకు నివాళులర్పించేందుకే ఇక్కడికి వచ్చాను. నాయనార్‌, అతని భార్య శారద టీచర్‌, కరుణాకరన్‌, అతని భార్య కల్యాణికుట్టి అమ్మతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి.’ అని ఆయన అన్నారు.

కాగా, త్రిస్సూర్‌ స్థానం నుంచి ఎంపీగా గెలిచన తర్వాత సురేష్‌ గోపి ఈ నెల 12న నాయనార్‌ ఇంటికి కూడా వెళ్లాడు. ఇక ఈ సందర్బంగా సురేష్‌ గోపి భారత మాజీ ప్రధాని ఇందిరిగాంధీని భారతమాతగా అభివర్ణించారు. కరుణాకరన్‌ కేరళ కాంగ్రెస్‌ పార్టీకి తండ్రిగా అభివర్ణించారు. అయితే కరుణాకరన్‌ను కాంగ్రెస్‌కి తండ్రిగా అభివర్ణించడం ఆ పార్టీ వ్యవస్థాపకులు లేదా సహ వ్యవస్థాపకులను అగౌరవపరచడం కాదని ఆయన వివరించారు. కరుణాకరన్‌ ధైర్యవంతమైన పాలకుడని ఆయన ప్రశంసించారు.

➡️