డిసిడబ్ల్యుని కాపాడాలని కేజ్రీవాల్‌కు స్వాతిమలివాల్‌ లేఖ

Jul 2,2024 17:08 #Delhi

న్యూఢిల్లీ : ఆప్‌ రాజ్యసభ ఎంపి స్వాతిమలివాల్‌ డిసిడబ్ల్యు (ఢిల్లీ కమిషన్‌ ఫర్‌ వుమెన్‌)ని కాపాడాలంటూ ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆమె లేఖ రాశారు. ఈ లేఖలో డిసిడబ్య్లు ఎదుర్కొంటున్న సవాళ్లను స్వాతి లేఖలో ఎత్తిచూపారు. తాను డిసిడబ్య్లు ఛైర్‌పర్సన్‌ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నాశనం చేస్తోందని ఆమె మండిపడింది. ‘నా రాజీనామా తర్వాత కమిషన్‌కు జరిగిన అన్యాయం నన్ను చాలా నిరుత్సాహపరిచింది. 181 మహిళా హెల్ప్‌లైన్‌ను స్వాధీనం చేసుకోవడం, కమిషన్‌కు నిధుల నిలిపివేత, బడ్జెట్‌లో కోత విధించడం, సిబ్బందిని తొలగించడం.. నాయకత్వ పదవులు ఖాళీలు వంటివి కమిషన్‌ ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లు. రేప్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌గా పేరొందిన నగరానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు (కేజ్రీవాల్‌) మహిళలు, బాలికలకు రక్షణ కల్పించే వ్యవస్థలను రక్షించడం చాలా కీలకం. సిఎం మంత్రులు తక్షణమే జోక్యం చేసుకుని రాజధాని మహిళలు, పిల్లలను ఆదుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.’ అని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

➡️