NCERT : 3,6 తరగతులకు మారనున్న సిలబస్‌

Apr 4,2024 17:54 #NCERT, #New Textbooks

న్యూఢిల్లీ   :   నూతన సిలబస్‌కు సంబంధించి నేషనల్‌ కౌన్సిల ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సిఇఆర్‌టి) గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. 3,6 తరగతులకు మాత్రమే సిలబస్‌ మారనుందని ప్రకటించింది. 3వ తరగతి పాఠ్యపుస్తకాలను ఏప్రిల్‌ చివరి వారం నాటికి, 6వ తరగతి పాఠ్యపుస్తకాలను మే నెల మధ్య నాటికి పాఠశలలకు అందించనున్నట్లు తెలిపింది. నూతన సిలబస్‌ను అనుసరించి 6వ తరగతి విద్యార్థులకు బోధించేందుకు ఉపాధ్యాయులకు బ్రిడ్జి కోర్స్‌ ఎన్‌సిఇఆర్‌టి పోర్టల్‌లో అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది.

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 1,2,7,8,10,12 తరగతుల పాఠ్యపుస్తకాలు 1.21 కోట్ల కాపీలను దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. 4,5,9, 11 తరగతుల పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని, డిజిటల్‌ కాపీలు అన్ని ఎన్‌సిఇఆర్‌టి పోర్టల్స్‌లో అందుబాటులో ఉన్నట్లు సిబిఎస్‌ఇ చైర్‌పర్సన్‌ ఎక్స్‌లో తెలిపారు. 4,5,9,11 తరగతులకు సంబంధించి 27.58 లక్షల పుస్తకాలు విడుదలయ్యాయని,  మరో 1.03 కాపీల కోసం  ఆర్డర్ చేశామని అన్నారు.   కొత్త కాపీలు మే 31 నాటికి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్లు  వెల్లడించారు.

➡️