రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యం : బివి.రాఘవులు

న్యూఢిల్లీ : మతోన్మాదంతో దేశాలు అభివఅద్ధి చెందవని, రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే తమ లక్ష్యం అని సిపిఎం పొలిటికల్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. గురువారం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ … మతాల ప్రాతిపదికన రాజకీయం చేసిన పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ పరిస్థితి నేడు ఏవిధంగా ఉందో అందరికీ తెలుసని… ప్రస్తుతం మన దేశంలో కూడా అచ్చం అలాంటి పరిస్థితే ఉందని చెప్పారు. మత కార్యక్రమాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బిజెపి తమ సొంత కార్యక్రమంగా చేపట్టిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే తమ లక్ష్యం అని బివి.రాఘవులు స్పష్టం చేశారు.

➡️