అరెస్టు అక్రమం

May 27,2024 23:12 #Delhi liquor case, #Kavitha arrest
  • కవిత బెయిల్‌ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ కేసు వ్యవహారంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను దర్యాప్తు సంస్థలు అక్రమంగా అరెస్టు చేశాయని ఆమె తరపున న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. కేవలం అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలంతో ఒక పార్టీ సీనియర్‌ నాయకురాలిగా, ఎమ్మెల్సీగా ఉన్న కవితపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి, అదుపులోకి తీసుకున్నారన్నారు. లిక్కర్‌ కేసులో ఇడి, సిబిఐ కేసుల్లో బెయిల్‌ మంజూరు, అలాగే ట్రయల్‌ కోర్టు.. కవిత అరెస్ట్‌కు సిబిఐకి అనుమతి, కస్టడీ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కవిత వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ దాదాపు 45 నిమిషాలపాటు సుదీర్ఘ విచారణ జరిపారు.

➡️