NEET row : పరీక్ష ముందు రోజే ప్రశ్నా పత్రం లీక్‌

న్యూఢిల్లీ : నీట్‌ పరీక్ష వివాదం కొత్త మలుపు తిరిగింది. నీట్‌ ప్రశ్నాపత్రం పరీక్షకు ముందు రోజు లీకైందని బీహార్‌లో అరెస్టయిన నలుగురు వ్యక్తులు అంగీకరించారు. నీట్‌ అభ్యర్థి అనురాగ్‌ యాదవ్‌, ధన్‌పూర్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌లో జూనియర్‌ ఇంజనీర్‌ సికందర్‌ యాదవేందు, మరో ఇద్దరు నితీష్‌ కుమార్‌, అమిత్‌ ఆనంద్‌లను బీహార్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఏ పోటీ పరీక్ష ప్రశ్నాపత్రమైనా లీక్‌ చేయవచ్చని, నీట్‌ ప్రశ్నాపత్రానికి ఒక్కొక్కరికీ రూ. 30 లక్షలు ఖర్చు అవుతుందని అమిత్‌ ఆనంద్‌, నితీష్‌ కుమార్‌లు తనతో చెప్పారని యాదవెందు పేర్కొన్నారు. నలుగురు విద్యార్థులు ఉన్నారని, వారు పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు సహాయం కావాలని వారిని కోరారని యాదవెంతు తెలిపారు. జూన్‌ 4న రాత్రి ఆ విద్యార్థులను తనతో పాటు తీసుకువెళ్లానని, ఇద్దరు నిందితులు వారికి ప్రశ్నాపత్రం ఇచ్చారని అన్నారు. అయితే తాను ఒక్కొక్కరిని రూ. 30 లక్షలకు బదులుగా రూ. 40 లక్షలు అడిగానని పోలీసులకు తెలిపారు. మరుసటి రోజు వెహికల్‌ చెకప్‌లో విద్యార్థుల అడ్మిట్‌ కార్టులతో పట్టుబడ్డానని, నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.

➡️