హక్కుల సాధనకు కదంతొక్కిన రైతులు, ఆదివాసీలు

నాసిక్‌ కలెక్టరేట్‌ వద్ద వేలాదిగా బైఠాయింపు

అటవీ భూముల హక్కుల కోసం, ఉల్లికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌

నాసిక్‌ : నాసిక్‌ కలెక్టరేట్‌ వద్ద వేలాదిమంది రైతులు, ఆదివాసీలు బైఠాయించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మార్చి 2 నుంచి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏళ్ల తరబడి అటవీ భూమిని సాగుచేస్తున్న గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పించాలని, ఉల్లికి కింటాకు రూ.2,000 కనీస మద్దతు ధర ప్రవేశపెట్టాలని, ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన నాసిక్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట గిరిజనులు, రైతులు చేపట్టిన నిరవధిక ఆందోళన గురువారం నాలుగోరోజూ కొనసాగింది. నాసిక్‌ జిల్లా 15 తాలూకాలకు చెందిన 25 వేల మందికిపైగా రైతులు, గిరిజనులు నిరసనలో పాల్గొన్నారు.

➡️