హోర్డింగ్‌ కూలిన ఘటనలో మరో ఇద్దరి మృతి

ముంబయి : ముంబయిలోని ఘాట్‌కోపర్‌ వద్ద హోర్డింగ్‌ కుప్పకూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 16కు చేరింది. శిథిలాలను తొలగిస్తుండగా.. బుధవారం రాత్రి మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. మరణించిన వారిని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విశ్రాంత మేనేజర్‌ మనోజ్‌ చన్సోరియా(60), ఆయన భార్య(59)గా పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా తల్లిదండ్రులు తన ఫోన్‌ ఎత్తకపోవడంతో అమెరికాలో ఉన్న వారి కుమారుడు ఆందోళన గురయ్యాడు. ఇక్కడ ఉన్న బంధువులను అప్రమత్తం చేయడంతో.. వారు మిస్సింగ్‌ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వారి దుర్మరణం వార్త తెలిసింది. ఇక ఈ ఘటనలో 41 మంది గాయపడ్డారు.

➡️