మరో ఇద్దరు లోక్‌సభ సభ్యుల సస్పెండ్‌ ..

Dec 20,2023 17:11 #Opposition MPs, #Parliament, #suspended

 న్యూఢిల్లీ :    లోక్‌సభ బుధవారం మరో ఇద్దరు సభ్యులను సస్పెండ్‌ చేసింది. దీంతో సస్పెండ్‌కు గురైన మొత్తం సభ్యుల సంఖ్య 143కి చేరింది. కేరళ కాంగ్రెస్‌ ఎంపి సి. థామస్‌, సిపిఎం ఎంపి ఎ.ఎం. ఆరిఫ్‌ సస్పెండ్‌ చేయాలంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తమ సహోద్యోగుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇద్దరు సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. సస్పెండ్‌కు గురైన మొత్తం 143 మంది ప్రతిపక్ష సభ్యుల్లో లోక్‌సభ నుండి 97 మంది, రాజ్యసభ నుండి 46 మంది ఉన్నారు.

➡️