Uddhav Thackeray : నన్ను వీడిని వారిని.. పార్టీలోకి తిరిగి తీసుకోను : ఉద్దవ్‌ ఠాక్రే

Jun 15,2024 18:16 #Maharashtra, #Uddhav Thackeray

ముంబయి : మహారాష్ట్ర మాజీ సిఎం, శివసేన (యుబిటి) పార్టీ చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వీడిని వారిని తిరిగి పార్టీలోకి తీసుకోబోనని అన్నారు. శివసేన పార్టీని చీల్చి.. సిఎం పదవిని దక్కించుకున్న ఏక్‌నాథ్‌షిండేకు, అతని వర్గానికి ఈ మేరకు ఉద్ధవ్‌ మెసేజ్‌ ఇచ్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడి (ఎంవిఎ) ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో శనివారం ఆ కూటమి నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌, కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చవాన్‌తోపాటు, ఉద్ధవ్‌ ఠాక్రే కూడా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏక్‌నాథ్‌షిండే వర్గంలోని నాయకుల్ని మళ్లీ తిరిగి పార్టీలోకి తీసుకుంటారా? అన్న వ్యాఖ్యలను ఉద్ధవ్‌ తోసిపుచ్చారు. ‘నన్ను విడిచిపెట్టిన వారిని పార్టీలోకి తిరిగి తీసుకోను అని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష కూటమి కలిసి పోటీ చేస్తుందని, దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తమ పోరాటమని ఉద్ధవ్‌ చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం.. ఎంవిఎ ప్రభుత్వం మాదిరిగా మారింది. ఈ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతోందో చూడాలి. గతంలో తమ ఎంవిఎ ప్రభుత్వాన్ని దేవేంద్ర ఫడ్నవీస్‌ మూడు చక్రాల రిక్షా అని అభివర్ణించారు. ఇప్పుడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పరిస్థితి కూడా అలాగే ఉందని ఉద్ధవ్‌ విమర్శించారు.

➡️