ఉమ్మడి పౌర స్మృతి ప్రభుత్వ ఎజెండాలో భాగమే కేంద్ర- న్యాయ శాఖ మంత్రి మేగ్వాల్‌

Jun 11,2024 23:47 #Law Minister Meghwal, #speech

న్యూఢిల్లీ : ఉమ్మడి పౌర స్మృతి ప్రభుత్వ ఎజెండాలో భాగమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేగ్వాల్‌ చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ లిటిగేషన్‌ విధానపత్రంపై తొలి సంతకం చేశారు. మోడీ ప్రభుత్వ వంద రోజుల ఎజెండాలో భాగంగా ఈ విధాన పత్రాన్ని ఆమోదం కోసం కేబినెట్‌ ముందు పెట్టనున్నారు. న్యాయమూర్తుల నియామకాలకు అనుసరించాల్సిన పద్దతులపై త్వరలో పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ నెలకొందన్న వ్యాఖ్యలను ఆయన తిరస్కరించారు. ఒక దేశం, ఒక ఎన్నిక అంశంపై మాట్లాడుతూ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను సమర్పించిందని, లా కమిషన్‌ దీనిపై కసరత్తు చేస్తోందని తెలిపారు. న్యాయస్థానాల ముందు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న అంశాలపై సత్వర న్యాయం అందజేయాలన్నది తన మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత అని చెప్పారు.

➡️