యుపి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ చైర్‌పర్సన్‌ తొలగింపు

న్యూఢిల్లీ  :    యుపి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ చైర్‌పర్సన్‌ను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం తొలగించింది. ఇటీవల ప్రశ్నాపత్రం లీక్‌ కావడంతో పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పరీక్ష రద్దైన సంగతి తెలిసిందే. యుపి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ చైర్‌పర్సన్‌ రేణుకా మిశ్రాను తొలగించినట్లు యుపి ప్రభుత్వం పేర్కొంది. పరీక్ష రద్దైన కొద్దిరోజుల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

➡️