‘వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ల’తో భారీ ఆదాయం

Mar 20,2024 09:08 #Indian Railways, #Train Tickets

మధ్యప్రదేశ్‌ : రద్దు చేసిన వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ల ద్వారా భారతీయ రైల్వే భారీగా ఆదాయాన్ని పొందుతుంది. 2021-2024 మధ్య (జనవరి వరకు) రూ.1,229.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని సమాచార హక్కు చట్టం కింద ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడైంది. 2021లో మొత్తం 2.53 కోట్ల వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌లు రద్దు చేయగా వాటి ద్వారా ₹242.68 కోట్ల ఆదాయం పొందింది. 2022లో 4.6 కోట్ల టిక్కెట్‌లు రద్దు చేయగా వాటి ద్వారా ₹439.16 కోట్లు, 2023లో 5.26 కోట్ల టిక్కెట్‌లకు ₹505 కోట్లు, 2024లో(జనవరి) 45.86 లక్షల టిక్కెట్లకు ₹43 కోట్ల ఆదాయం వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కార్యకర్త వివేక్ పాండే దాఖలు చేసిన ఆర్‌టిఐ దరఖాస్తుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాధానం తెలిపింది.  ప్రతి సంవత్సరం వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌లు రద్దు వలన వచ్చే ఆదాయాలు పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

పరిమిత సామర్థ్యంతో రైల్వేలు డిమాండ్‌ను తీర్చలేకపోతున్నాయని చాలా స్పష్టంగా ఉందని మాజీ రైల్వే అధికారి హిందూ పత్రికతో పేర్కొన్నారు. డిమాండ్ సరళిని అంచనా వేయాలని, ఎక్కువగా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌లను అందించకుండా ఉండాలని ఆయన సూచించారు.

 

➡️