ఒడిశా పాఠశాలల్లోనూ వాటర్‌ బెల్‌

Apr 6,2024 00:06 #'Water Bell', #odisa

భువనేశ్వర్‌ : కేరళ, ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే ఒడిశా ప్రభుత్వం కూడా పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్‌’ ను మోగించాలని నిర్ణయించింది. ఎండ తీవ్రత అధికమవుతోన్న వేళ విద్యార్థులు, ఉపాధ్యాయులకు నీళ్లు తాగేందుకు బ్రేక్‌ ఇవ్వాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు విద్యాశాఖ కమిషనర్‌, కార్యదర్శి అశ్వతి ఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గత బుధవారం ఇచ్చిన ఈ ఆదేశాల ప్రకారం పాఠశాల సమయంలో మూడు సార్లు ‘వాటర్‌ బెల్స్‌’ మోగించాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులను నీరు తాగాలని సూచించారు. ప్రతి రోజూ ఉదయం 8.30, 10, 11 గంటలకు ‘వాటర్‌ బెల్‌’ను మోగిస్తారు. ఎండ తీవ్రత పెరుగుతోన్న క్రమంలో … విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. ఒడిశాలో ఏప్రిల్‌ 2 నుంచి ఒక్క పూట బడులు కొనసాగుతున్నాయి. ఉదయం 7 నుంచి 11:30 వరకు తరగతులను నిర్వహిస్తున్నారు.a

➡️