12న ఇడి విచారణకు హాజరవుతా : కేజ్రీవాల్‌

Will attend ED hearing on 12th: Kejriwal

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) జారీ చేసిన ఎనిమిదో సమన్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించారు. సమన్లను ‘చట్టవిరుద్ధం’ గా పరిగణించినప్పటికీ, ఈ నెల 12 తర్వాత తేదీన తాను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరవుతానని తెలిపారు. అయితే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించేందుకు ఇడి అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్‌ సమన్లకు స్పందించకపోవడంపై ఇటీవల ఇడి కోర్టులో ఫిర్యాదు చేసింది. న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. కేజ్రీవాల్‌ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

➡️