గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.100 తగ్గింపు

న్యూఢిల్లీ : వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. తాజా తగ్గింపుతో 14.2 కేజీల ఎల్‌పిజి సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.803గా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుకగా ఈ తగ్గింపును మోడీ అభివర్ణించారు. బిజెపి అధికారంలోకి వచ్చిననాటి నుంచి పదేపదే ఇంధన ధరలు పెంచుతూ వచ్చిన మోడీ సర్కార్‌ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే వంట గ్యాస్‌ ధర తగ్గించి నాటకాలు ఆడుతోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 2021-23 మధ్యలోనే ఏకంగా సిలిండర్‌ ధర రూ.300 చొప్పున పెరిగింది. కోవిడ్‌ విపత్తు సమయంలోనూ బిజెపి ప్రభుత్వం కనికరం లేకుండా ఇంధన ధరలు బాదేసింది. 2020 జూన్‌ నుంచి వంట గ్యాస్‌పై సబ్సిడీని సైతం మోడీ ప్రభుత్వం నిలిపింది. ‘ఉజ్వల’ లబ్ధిదారులకు మాత్రమే ప్రస్తుతం సబ్సీడి ఉంది.

➡️