పోక్సో కేసులో విచారణకు హాజరైన యడ్యూరప్ప

బెంగళూరు : పోక్సో కింద నమోదైన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు బిఎస్‌ యడ్యూరప్ప సిఐడి ముందు సోమవారం విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఈ నెల 13న ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టులో యడ్యూరప్పకు ఊరట లభించింది. ఈ నెల 28న జరిగే తదుపరి విచారణ వరకూ యడ్యూరప్పను అరెస్టు చేయవద్దని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే సిఐడి ముందు సోమవారం విచారణకు హాజరుకావాలని కూడా మాజీ ముఖ్యమంత్రిని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిఐడి కార్యాలయానికి సోమవారం ఉదయం యడ్యూరప్ప చేరుకున్నారు. సిఐడి అధికారుల సమాచారం ప్రకారం యడ్యూరప్ప వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తరువాత మధ్యాహ్న సమయంలో ఆఫీసు నుంచి యడ్యూరప్ప వెళ్లిపోయారు. 2012లో 17 ఏళ్ల బాలికపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడినట్లు 2015లో ఈ పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

➡️