అంగన్‌వాడీ పిల్లలకు వండి పెట్టలేం

Dec 20,2023 11:12 #Anganwadi strike, #Mid-Day Meal
  •  డిఇఒకు తెలిపిన ఎండిఎం కార్మికులు

ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌  :  అంగన్‌వాడీ కేంద్రాలు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వంట చేసి పెట్టాలని అధికారులు ఆదేశాలు ఇస్తున్నారని, తాము అంగన్‌వాడీల పోరాటానికి మద్దతు ఇస్తున్నందున వంట చేసి పెట్టబోమని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం నాయకులు డిఇఒ బి.లింగేశ్వరరెడ్డికి తెలిపారు.  మంగళవారం డిఇఒకు ఆ సంఘం నాయకులు బి.సుధారాణి, రామలక్ష్మి, సత్యవతి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం నుంచి అంగన్‌వాడీ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో స్కూల్లో వంట చేయాలని అధికారులు చెప్పారని, అయితే, తామంతా అంగన్‌వాడీల సమ్మెకు మద్దతిస్తున్నామని తెలిపారు. అందువల్ల తాము పిల్లలకు వండి పెట్టలేమి తేల్చి చెప్పారు.

➡️