అమ్మవారిని దర్శించుకున్న సైంధవ్‌ చిత్ర బృందం

Dec 11,2023 15:28 #actor, #Venkatesh

ప్రజాశక్తి-విజయవాడ : వెంకటేశ్‌ నటించిన పాన్‌ ఇండియా మూవీ సైంధవ్‌ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అందులో భాగంగా నటుడు వెంకటేశ్‌తోపాటు దర్శకుడు, హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ తదితరులు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చిత్రబృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం టిఫిన్‌ చేసేందుకు బాబారు హౌటల్‌కు రావడంతో సందడి నెలకొంది. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు జనం పోటెత్తారు.

➡️