అయిదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి: ఇంటర్‌ బోర్డు

Mar 2,2024 15:15 #inter board, #orders

హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు ఇక నుంచి పరీక్షా కేంద్రానికి అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఇంటర్‌ బోర్డు జిల్లా అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. ఇంతవరకు విద్యార్థులు నిమిషం ఆలస్యంగా హాజరైనా పరీక్షలకు అనుమతించకపోవడంతో ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో అయిదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించాలని ఇంటర్‌ విద్యాబోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

➡️