అసెంబ్లీలో వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాం : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: గత ప్రభుత్వం మాదిరి తాము అబద్ధాల బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదని, వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ”మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తాం. విచారణ తర్వాతే చర్యలుంటాయి. మా ఎమ్మెల్యేలనే కాదు… ప్రతిపక్షాలనూ అక్కడికి తీసుకెళ్తాం. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మా పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకువస్తే కలిసివెళ్తాం. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని జగ్గారెడ్డి అన్నారంటున్నారు. ఈ విషయంపై ఆయన్నే అడగాలి”అని చెప్పారు.

➡️