ఆకాశవాణిలో ‘సర్వభాషా కవి సమ్మేళనం’

Jan 25,2024 16:05 #akasavani, #kavi sammelanam

హైదరాబాద్‌: రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రతి ఏటా భారతీయ భాషల కవులను ఎంపికచేసే సర్వభాషా కవి సమ్మేళనాన్ని ఆల్‌ ఇండియా రేడియోకు చెందిన ఆకాశవాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్‌ సర్వభాషా కవి సమ్మేళనం నిర్వహించనుంది. ఈ సమ్మేళనం గురువారం రాత్రి 10 గంటల నుంచి ప్రసారం కానున్నట్లు ప్రకటించింది. ఇక ఈ కార్యక్రమంలో జనవరి 5న రాంచీలో నిర్వహించిన ఆకాశవాణి సర్వ భాషా కవి సమ్మేళనంలో పాల్గన్న 22 భాషల కవుల కవితలను తెలుగులోకి అనువాదం చేయించి ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం రూపొందించిన ‘సర్వభాషా కవి సమ్మేళనం’ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం చేయనునన్నట్లు వెల్లడించింది. ఈసారి సర్వ భాషా కవి సమ్మేళనంలో పాల్గన్న నిజామాబాద్‌కు చెందిన తెలుగు కవి డాక్టర్‌ మల్లెగోడ గంగా ప్రసాద్‌ గారి ‘వెలసి జీవి’ కవితతో పాటు వివిధ భాషల చెందిన కవితలకు అనువాదాలు ఈ కార్యక్రమంలో ప్రసారం అవుతాయి. డాక్టర్‌ దేవూరి అనంత పద్మనాభరావు, డాక్టర్‌. ఎస్‌. గోపాలకఅష్ణ, డాక్టర్‌ సి. మఅణాళిని, డాక్టర్‌ జీ.వి. సర్నాకర్‌ డాక్టర్‌ మంగారి రాజేందర్‌ డాక్టరీ ఏనుగు నరసింహారెడ్డి డాక్టర్‌ అమరవాది నీరజ అజరు వర్మ అల్లూరి, అస్కార సూర్యప్రకాష్‌, ముకుంద రామారావు, సుమనస్పతి రెడ్డి రాజులపల్లి ప్రతాపరెడ్డి, కుప్పిలి పద్మ మహ బలీస్‌ దర్భశయనం శ్రీనివాసదార్య, సి.ఎస్‌. రాజబాబు రావికంటి శ్రీనివాస్‌ యశస్వీ సతీష్‌, దేశరాజు, యీన్సీ కొప్పిశెట్టి, గీతా వెల్లండి, సందకిషోర్‌, వివిధ భాషల కవితలకు తెలుగు అనువాదాలు చేశారు. ఆకాశవాణి స్టూడియోలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో వీరంతా తమ తమ అనువాద కవితలు చదివారు. ఈ సర్వభాషా కవి సమ్మేళనాన్ని ఆకాశవాణి జనవరి గురువారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేయనుంది.

➡️