ఆర్టీసీ కండక్టర్‌, డ్రైవర్ల పై దాడులు సరికాదు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Dec 28,2023 14:44 #press meet, #tsrtc md sajjanar

హైదరాబాద్‌ : కొత్తగూడెం బస్సు డ్రైవర్‌ పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో మహిళా కండక్టర్‌ ను ప్రయాణికులు దూషించడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సీరియస్‌ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..టిఎస్‌ఆర్టీసికి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారన్నారు. సిబ్బంది కఅషి వల్లే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై స్థానిక పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేసి.. విచారణ చేపట్టారని తెలిపారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావఅతం కాకుండా సహకరించాలని కోరుతున్నామన్నామన్నారు.

➡️