ఆస్తి కోసం అత్తమామాలపై కాల్పులు జరిపిన అల్లుడు

Feb 28,2024 16:15 #crime

మంచిర్యాల : పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోలేదని చెప్పి ఓ అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు. మరింత ఆస్తి కావాలని డిమాండ్‌ చేస్తూ అత్తమామలపై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని సాలిగామా గ్రామంలో చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసం అల్లుడు నరేందర్‌ తమపై కాల్పులు జరిపినట్లు అత్తమామలు పోలీసులకు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో తమకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. బుల్లెట్లు గోడకు తగిలాయని చెప్పారు. కాల్పుల అనంతరం నరేందర్‌ పారిపోయినట్లు పోలీసులకు తెలిపారు. విచారణ కొనసాగుతోందని ఏసీపీ రవి కుమార్‌ పేర్కొన్నారు.

➡️