ఆ ఇద్దరితో సిఎఫ్‌ఎంఎస్‌ నాశనం – ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు

Mar 26,2024 21:55 #prakatana, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, ఒఎస్‌డి ధనంజరురెడ్డి నాశనం చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఆర్థికశాఖలో పారదర్శకత కోసం తెచ్చిన వ్యవస్థను నాశనం చేస్తున్నారని సోమవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. సత్యనారాయణ, ధనంజరురెడ్డి కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసిపికి మద్దతుగా నిలిచే కాంట్రాక్టర్లకు సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచార సమయంలో సిఎం కార్యాలయం నుంచే అనేక చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. వెంటనే వారిద్దరినీ విధుల్లోంచి తప్పించాలని కోరారు.
వలంటీర్లపై టిడిపి అభ్యర్థి బజ్జల సుధీర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులుగా శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యంను పార్టీ నియమించింది. ఆయనతో జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కెఎస్‌ జవహర్‌ను, విశాఖ, హిందూపురం పార్లమెంటు అధ్యక్షులుగా గండి బాబ్జి, బివి వెంకటరాముడును నియమించింది. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సిఎం సురేష్‌, మన్నే సుబ్బారెడ్డి, కొవ్వలి యతిరాజా రామ్మోహన్‌నాయుడును, ముదునూరి మురళీకృష్ణంరాజు, వాసురెడ్డి ఏసుదాసులను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

➡️