ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది : భట్టి

Dec 10,2023 14:53 #bhatti vikramarka, #paryatana

ఖమ్మం: రాష్ట్రంలో బహుళార్ధక ప్రాజెక్టులు చేపడతామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ఖమ్మంకు వచ్చారు. ఈ సందర్భంగా వారికి నాయకన్‌గూడెం వద్ద భారీ గజమాలతో కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. కూసుమంచిలో ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను మంత్రులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడారు.”ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది. ఆరు గ్యారంటీల్లో 2 గ్యారంటీలను 2 రోజుల్లోనే ప్రారంభించాం. రాష్ట్ర వనరులను సంపద సఅష్టికి వాడుతాం. సఅష్టించిన సంపదను ప్రజలకు పంచడమే కాంగ్రెస్‌ అజెండా. పరిశ్రమలు, ఐటీ, సేవారంగాన్ని ప్రోత్సహిస్తాం. ఆరు గ్యారంటీలను మొదటి వంద రోజుల్లో అమలు చేస్తాం. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో మరిన్ని హామీలు పొందుపరిచాం. ఆరు గ్యారంటీలకు వారంటీ లేదని భారాస విమర్శించింది. వారంటీ లేదన్న పెద్దలకు చెంపదెబ్బ తగిలేలా ప్రజలు చేశారు” అని భట్టి వ్యాఖ్యానించారు.

➡️