ఇరిగేషన్‌ శాఖలో వందల కోట్ల కుంభకోణం: సోమిరెడ్డి

Mar 12,2024 14:37 #press meet, #somireddy

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్‌ శాఖలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆరోపించారు. సర్వేపల్లిలోనే రూ.300 కోట్ల పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారని మండిపడ్డారు. కాలువలు, షట్టర్ల మరమ్మతుల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని.. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారని ధ్వజమెత్తారు. నెల రోజుల కిందట ఈ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా.. స్పందించలేదన్నారు.  తప్పు చేసిన అధికారులు ఊచలు లెక్క పెట్టుకోవాల్సిందేనని హెచ్చరించారు. వీటి మీద నెల రోజుల్లో ప్రత్యేక విచారణ జరిపిస్తామన్నారు.

➡️