ఇల్లు ఇవ్వలేదని గ్రామపంచాయతీ కార్యాలయానికి నిప్పు

కామారెడ్డి : తనకు డబుల్‌ బెడ్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించడం లేదని ఆవేశంతో ఓ యువకుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా, బిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన ఓ యువకుడు తనకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఎందుకు కేటాయించడం లేదని సర్పంచ్‌తో గొడవకు దిగాడు. మాట మాట పెరిగి కోపోద్రిక్తుడై పంచాయతీ కార్యాలయంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పారు. ఈ ఘటనలో ఆఫీస్‌లోని ఫర్నీచర్‌ పాక్షికంగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

➡️