ఈనెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ : కేటీఆర్‌

Mar 7,2024 16:00 #KTR, #speech

కరీంనగర్‌ : ఈ నెల 12వ తేదీన కేసీఆర్‌ తిరిగి జంగ్‌ సైరన్‌ ఊదడానికి, కదన భేరీ మోగించడానికి మన కరీంనగర్‌కే వస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. కరీంనగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ మీటింగ్‌లో కేటీఆర్‌ పాల్గని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కరీంనగర్‌ అంటే సెంటిమెంట్‌ అని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు.

”2001, మే 17న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ మైదానంలో సింహా గర్జన నిర్వహించుకున్నాం. ఇప్పుడు కూడా అదే మైదానం నుంచి కదన భేరీ మోగించబోతున్నాం. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి పోస్టర్లు రీలిజ్‌ చేసుకున్నాం. ఈ పోస్టర్లు గ్రామాలకు, పట్టణాలకు వెళ్లాలి. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మద్ధతుదారులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలి. ఎన్నికల శంఖారావం కరీంనగర్‌ నుంచే కేసీఆర్‌ ప్రారంభించబోతున్నారు” అని కేటీఆర్‌ తెలిపారు.

➡️