ఉద్యోగాల భర్తీ .. రాజకీయ ఎత్తుగడేనే? : గంటా

Dec 9,2023 16:10 #ganta srinivasarao, #press meet

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల పేరుతో రాష్ట్రంలో మరో కొత్త మోసానికి సీఎం జగన్‌ తెరలేపారని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. చివరకు ఉద్యోగాల భర్తీని కూడా రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా ఇష్టానుసారంగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా వైసిపి ప్రభుత్వ తీరుపై గంటా విమర్శలు గుప్పించారు. ఒక ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్‌ ఇచ్చి, ఎన్నికల ముందు పరీక్షలు నిర్వహిస్తామనడం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుంది.నిరుద్యోగులు గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఈ రెండింటికీ దరఖాస్తు చేసుకుంటారు. గ్రూప్‌-2 సిలబస్‌తో పోల్చితే గ్రూప్‌-1 సిలబస్‌లో అదనపు సబ్జెక్టులుంటాయి. గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ జరిగిన 20 రోజుల్లోనే గ్రూప్‌-1 అదనపు సబ్జెక్టులకు అభ్యర్థులు సిద్ధం కావడం చాలా కష్టమని నిరుద్యోగులు వాపోతున్నారు. మీ మోసపూరిత మేనిఫెస్టో మాదిరిగా ఎన్నికల ముందు హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల్లో గందరగోళం సఅష్టిస్తున్నారు.రాష్ట్రంలోని నిరుద్యోగులు అధైర్య పడాల్సిన అవసరం లేదని గంటా శ్రీనివాసరావు ధైర్యం చెప్పారు. ఏపీలో అధికారంలోకి రాబోతోంది చంద్రన్న ప్రభుత్వమేనని.. 2024లో పోస్టులను భర్తీ చేసే బాధ్యత టిడిపి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

➡️