ఉద్యోగులకు డిఎ పెంపు -చెల్లింపు మాత్రం ఆగస్టులో

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ఒక్క రోజుముందు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఎ పెంచింది. ఈ మేరకు ఆర్థికశాఖ 30వ నెంబర్‌ జిఓను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30.03 శాతం నుండి 33.67 శాతం డిఎ పెరగనుంది. 2006 యుజిసి పేస్కేల్‌ ప్రకారం జీతాలు తీసుకుంటున్న వారికి 221 శాతం నుండి 230 శాతం, 2016 యుజిసి పే స్కేల్‌ ప్రకారం జీతాలు తీసుకుంటున్న వారికి 42 నుండి 46 శాతం డిఎ పెరిగింది. జులై 23 నుండి పెంపుదల అమలులోకి వచ్చినట్లు జిఓలో పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది జులై జీతంతో కలిపి ఆగస్టునెలలో మొదటి చెల్లింపు చేస్తారు. మిగిలిన డిఎ బకాయిలను సెప్టెంబర్‌, డిసెంబర్‌, 2025 మార్చి నెలల్లో మూడు వాయిదాలుగా చెల్లించనున్నారు.

➡️