ఎయు విసిగా మరోసారి పివిజిడి ప్రసాద్‌రెడ్డి

Jan 17,2024 21:40 #press meet, #PVGD Prasad Reddy

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం): ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టం ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ సీనియర్‌ అధ్యాపకులు పివిజిడి ప్రసాద్‌రెడ్డిని మరొకసారి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమిస్తూ బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవి కాలంలో మూడేళ్లు కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రసాద్‌రెడ్డి విసి పదవీకాలం గత ఏడాది నవంబర్‌ 26న ముగియడంతో రెక్టార్‌గా పనిచేస్తున్న ఆచార్య కె సమతను ఇన్‌ఛార్జి విసిగా నియమించారు. ప్రస్తుతం మరోసారి పివిజిడి ప్రసాదరెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

➡️