ఏడు గ్యారంటీలతో అధికారంలోకి వస్తాం – పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

Jan 10,2024 08:32 #gidugu rudraraju, #press meet

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం): ఏడు గ్యారంటీలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ విశాఖ నగర అధ్యక్షులు గొంప గోవిందరాజు ఆధ్వర్యాన మేఘాలయ హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి, ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, బిసిల కులగణన, క్రైస్తవుల పరిరక్షణ, విభజన చట్టంలోని హామీల అమలు తదితర అంశాలతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామన్నారు. 22 లోక్‌సభ స్థానాలను వైసిపికి కట్టబెట్టినా ప్రత్యేక హోదా, పోలవరం సాధించలేకపోయిందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి జెడి.శీలం, పిసిసి వర్కింగ్‌ కమిటీ సభ్యులు కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️