ఏపీలో ప్రభుత్వ సలహదారుల ఖర్చు రూ. 680 కోట్లు .. విచారణకు జనసేన డిమాండ్‌

Feb 1,2024 17:05 #nadella manohar, #press meet

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సలహదారుల వల్ల భారీ సంఖ్యలో ప్రభుత్వ ధనం వఅథా అవుతుందని జనసేన నాయకుడు నాదేండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. సుమారు 80 నుంచి 90 మందిని ప్రభుత్వ సలహదారులుగా, ఉప సలహదారులుగా నియమించారని ఆరోపించారు.గడిచిన 5 ఏండ్లలో రూ.680 కోట్లను వీరి జీతభత్యాలకు, ఇతర ఖర్చులకు ప్రభుత్వం అందజేసిందని విమర్శించారు. ఒక్క సజ్జల రామకఅష్టారెడ్డికే 140 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుచేసిందని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో సలహదారుల నియామకం ముఖ్యమంత్రికి కూడా తెలియకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహదారుల నియామకంపై హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఖర్చుల నియంత్రణ చేయడం లేదని వైసీపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. సలహదారుల పేర్లను బహిరంగపరచాలని ఆయన డిమాండ్‌ చేశారు.ప్రభుత్వానికి సలహదారులిచ్చిన సలహాలు ఏమిటో వెల్లడించాలని కోరారు. ప్రభుత్వం వద్ద మంత్రులు, అధికారులు, ఉద్యోగులున్నా గాని వారి సేవలను ఉపయోగించుకోకుండా సలహదారుల పేరిట రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారని, సలహదారుల నియామకంపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై సమాదానం ఇవ్వాలని కోరారు.

➡️