ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలకు భద్రత పెంపు

Feb 8,2024 17:01 #increased, #Security, #ys sharmila

అమరావతి : ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలకు ప్రభుత్వం భద్రత పెంచింది. ఇప్పటి వరకు ఆమెకున్నా వన్‌ ప్లస్‌ వన్‌ భద్రతను 2 ప్లస్‌ 2 భద్రతకు పెంచినట్లు వైఎస్‌ఆర్‌ జిల్లా ఎస్పీ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. షర్మిల అభ్యర్థన మేరకు ఈ భద్రత పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.వైఎస్‌ షర్మిల తనకు భద్రత కల్పించడం లేదంటూ గత రెండు రోజులుగా ఆమె ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. తనకు కీడు చేసేందుకే ఏపీ ప్రభుత్వం భద్రత ఇవ్వడం లేదని ఘాటుగానే విమర్శలు చేశారు. ప్రభుత్వానికి విన్నవించుకున్న పట్టించుకోకపోవడ వెనుక చెడు చేయడమే లక్ష్యంగా కనిపిస్తుందని ఆమె ఆరోపించారు.ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ కల్పించలేని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా వ్యవహరించడం లేదంటూ మండిపడ్డారు. తనకు 4 ప్లస్‌ 4 భద్రత కల్పించాలని కోరగా ఆలస్యంగానైనా స్పందించిన ప్రభుత్వం 24 గంటల్లో షర్మిలకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం.

➡️