ఐద్వా సీనియర్ నాయకురాలు వెంకాయమ్మ మృతి

Jan 3,2024 13:17 #aidwa, #death

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : సిపిఎం సానుభూతిపరురాలు మరియు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సీనియర్ నాయకురాలు పాలు పూరి వెంకాయమ్మ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా ఇటుకల గుంట గ్రామంలో మరణించారు. ఆమె మరణానికి సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ, సిపిఎం పార్టీ మండల నాయకులు కండెల్లి సోమరాజు, వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు మడక రాజు, మండల కమిటీ సభ్యులు పురిటిగడ్డ జయమ్మ, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కర్రీ నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు కరెడ్ల రామకృష్ణ, గున్నబత్తుల నాగేశ్వరరావు, జవ్వాది శ్రీను, నర్మాల కృష్ణ, ఎం వెంకటరమణ తదితరులు వెంకయ్యమ్మకి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వెంకాయమ్మ సిపిఎం, మహిళా సంఘం రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపులో పాల్గొనేవారిని, స్థానిక సమస్యల మీద ముక్యంగా బెల్టు షాపులకు వ్యతిరేకంగా మహిళలను కూడగట్టి మద్యం సీసాలను పగలగొట్టి ఆ గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చేయించారన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో మహిళలను సంఘ సభ్యులుగా చేర్పించే వారన్నారు. వారి కుటుంబ సభ్యులకు నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

➡️