ఒకే క్యాంపస్‌లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు : సిఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ‘చదువుమీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి.. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సిఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ భవన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్‌ రామ్‌ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కఅషి చేస్తోందన్నారు. గతంలో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు విడి విడిగా ఉండేవని, దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒకే క్యాంపస్‌ లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలు చెరిపి వేయాలనుకుంటున్నామని, పైలట్‌ ప్రాజెక్టుగా కొడంగల్‌ లో శంకుస్థాపన చేసామన్నారు. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు.. చదువే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగండి’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

➡️