ఓటరుకు తెలియకుండా ఓటు తొలగిస్తే అది కచ్చితంగా నేరమే: నిమ్మగడ్డ రమేష్‌

గుంటూరు జిల్లా: ఏపీలో మాత్రం అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయని మాజీ ఎన్నికల కమిషన్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయని, ఓటరుకు తెలియకుండా ఓటు తొలగించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఓటరుకు తెలియకుండా తొలగిస్తే అది కచ్చితంగా నేరమే, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోక తప్పదన్నారు.ఓటు తొలగించే ముందు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, ఓటరు జాబితా అక్రమాలపై ఈసీ సరైన చర్యలు తీసుకోలేదని, వెనుక నుంచి అదఅశ్య శక్తి నడిపిస్తుందా అన్న సందేహాలున్నాయని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అనుమానం వ్యక్తం చేశారు. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడంలో దేశం ముందుందని, తెలంగాణలో ఎక్కడా రీపోలింగ్‌, దాడులు జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఎన్నికలు జరిగాయా అన్ని రీతిలో ముగిశాయని మాజీ ఎన్నికల కమిషన్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తెలిపారు.

➡️