ఓటర్ల జాబితాలో తప్పులపై రాష్ట్రపతికే ఫిర్యాదు చేసుకోవాలా?: విష్ణుకుమార్‌ రాజు

Jan 25,2024 14:36 #ex mla, #press meet

విశాఖ: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తప్పులు అలానే ఉన్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఒకే డోర్‌ నంబర్‌తో 67 ఓట్లు ఉన్న అంశాన్ని సరిదిద్దలేదని చెప్పారు. స్వతంత్రంగా వ్యవహరించే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఓటర్ల జాబితాను సరి చేయకపోవడం ఏంటని నిలదీశారు. ఇక రాష్ట్రపతికే ఫిర్యాదు చేసుకోవాలా? అని ప్రశ్నించారు.వైసిపి ఓటమి ఖాయమని.. ప్రజలంతా ఆ దిశగానే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ”విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు సెక్యూరిటీ పెట్టుకునే కొత్త చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్‌ తెచ్చుకున్నారు. రాష్ట్ర వెనుకబాటుతనంపై మీ సోదరి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేవా జగన్‌?”అని విష్ణుకుమార్‌ రాజు ప్రశ్నించారు.

➡️