కరాచీ బేకరీలో పేలిన సిలిండర్‌.. ఆరుగురి పరిస్థితి విషమం

Dec 14,2023 14:33 #Fire Accident, #rajendra nagar

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న కరాచీ బేకరీలో భారీ ప్రమాదం జరిగింది. బేకరీ కిచెన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడినవారిని బేకరీ యాజమాన్యం దవాఖానకు తరలించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు. గాయపడినవారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారే ఉన్నారని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు.

➡️