కర్నూలు వైసీపీ అభ్యర్థిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి

Feb 29,2024 15:30 #amd inthyaj, #join ycp

అమరావతి : ఏపీకి చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌ గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయనకు సీఎం జగన్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతియాజ్‌ వచ్చే ఎన్నికల్లో కర్నూలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆయన ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.గతంలో ఆయన సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ ఏపీలో జగన్‌ ప్రభుత్వం నవరత్నాల పేరిట అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతగానో మేలు చేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, కర్నూలు మేయర్‌ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️