కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలి : కేటీఆర్‌

Mar 10,2024 16:35 #KTR, #speech

కామారెడ్డి: కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కామారెడ్డిలోని పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమై మాట్లాడారు. కామారెడ్డిలో గంప గోవర్ధన్‌ నాయకత్వంలోనే పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.”అసంబద్ధమైన హామీలు ఇచ్చి కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించారు. డిసెంబర్‌ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. ఏమైంది? చిత్తశుద్ధి ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలి. 100 రోజులు అయ్యాక ఆడబిడ్డలు కాంగ్రెస్‌ భరతం పడతారు. మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు కుంగాయి. మూడు నెలల్లో ఆ పిల్లర్లను బాగు చేయలేరా?”అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

➡️