కానిస్టేబుల్‌ను చంపడం దారుణం- సిపిఎం రాష్ట్ర కమిటీ

Feb 7,2024 21:40 #cpm, #prakatana

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అన్నమయ్య జిల్లా కంభంవారి పల్లె మండలం ఎంవిపల్లి గ్రామం వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ గణేశ్‌ను కారుతో ఢకొీట్టి చంపడం దారుణమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హత్యను ఖండించారు. ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లు కొంతకాలంగా పేట్రేగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం గర్హనీయమని, కానిస్టేబుల్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

➡️