కార్మికుల ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధం లేదు: సీపీఐ నారాయణ

Dec 29,2023 14:46 #cpi narayana, #press meet

హైదరాబాద్‌: సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య తగువు వచ్చిందని.. ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. కార్మికుల ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో బిఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు దుష్ట సంప్రదాయానికి తెరలేపిందన్నారు. ఎన్నికల వేళ కార్మికులను ప్రలోభాలకు గురిచేశారని మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ అనుబంధ సంఘాన్ని ఓడించామన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.

➡️