కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించిన సిపిఎం

Mar 21,2024 23:08 #cpm v srinivasarao, #prakatana

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత ఇడి అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ ప్రజలను భయకంపితులను చేసి ఎన్నికల్లో లాభపడాలని బిజెపి ప్రయత్నిస్తోందని అన్నారు. బిజెపి కక్షపూరిత, ప్రతీకార చర్యలను, నిరంకుశ పద్ధతులను ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రతిపక్షాలు ప్రత్యేకంగా ఇండియా ఫోరం పార్టీలపై రాజకీయ కక్షపూరిత చర్యలను ఆపాలని విజ్ఞప్తి చేశారు.

➡️