కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి వచ్చా : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనకు అధిష్ఠానం హామీ ఇచ్చిందని.. హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు.”కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి వచ్చా. నేను హోంమంత్రి అయితేనే బిఆర్‌ఎస్‌ నేతలు కంట్రోల్‌లో ఉంటారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌రావు, జగదీశ్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. భువనగిరి, నల్గండ లోక్‌సభ స్థానాల్లో మా కుటుంబసభ్యులెవరూ పోటీ చేయకూడదనేది మా ఆలోచన. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం. ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలిపిస్తాం” అని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

➡️